Minister Sabitha Indra Reddy | బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం : రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Minister Sabitha Indra Reddy | బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
మహేశ్వరం : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు. శుక్రవారం మహేశ్వరం మండల పరిధిలోని కల్వకోల్ గ్రామానికి చెందిన వంద మంది కాంగ్రెస్ ( Congress) , బీజేపీ (BJP ) నాయకులు గ్రామ సర్పంచ్ థామస్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ (BRS) లో చేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టనున్నారని అన్నారు. నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఆదరణ లభిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR ) నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ( Welfare Schemes ) ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకుల మాటలను ప్రజలు నమ్మలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో
కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కొండని లక్ష్మణ్, బీజేపీ పార్టీ మాజీ వార్డు సభ్యుడు శేఖర్, బావయ్య, చంద్రశేఖర్, నాగరాజు, లక్ష్మణ్, బండి రాజు, శేఖర్, సత్యనారాయణ తదతరులు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, నియోజక వర్గ ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, నాయకులు మోతీలాల్ నాయక్, మంత్రి రాజేశ్, లతీఫ్, కొండని శేఖర్, పెంజర్ల గోవర్ధన్, అశోక్, కుమార్, రాజు, రవి, లక్ష్మణ్, బబ్బులు, శ్రీకాంత్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

