దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 02 : ఈ నెల 5న నిర్వహించే దేవరకొండ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కు ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. బుధవారం మార్కెట్ యార్డ్లో క్లబ్ అధ్యక్షుడు జంతుక లింగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసిన ప్రతినిధులు, సెప్టెంబరు 5వ తేదీన నిర్వహించనున్న ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని కోరారు. ఈ సందర్భంగా విలేకరుల సంక్షేమం, ప్రెస్ క్లబ్ భవిష్యత్ కార్యక్రమాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.