ఇది అంతర్జాతీయ విద్యా వారోత్సవం. ఈ సందర్భంగా.. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ‘అమెరికాలో ఎందుకు చదువుకోవాలి?’ అని ఒక సాధారణ ప్రశ్న వేస్తోంది. దీనికి సమాధానంగా ఎన్నో వివరాలతో కూడిన పెద్ద జాబితాను చూపించవచ్చు. కానీ, దానికి బదులుగా అమెరికాలో చదువుకున్న భారతీయుల అనుభవాలను తెలుసుకుందామని ఈసారి ఒక విభిన్న ప్రయత్నం చేశాం. ఆ వివరాలివి..
20 ఏండ్ల కిందట కోగంటి శ్రీకాంత్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలో చేరాడు. చదువును కొనసాగించే క్రమంలో ఆయనకు అమెరికాలోని పది రాష్ర్టాల్లో పర్యటించే అవకాశం వచ్చింది. అమెరికాలోని వైవిధ్యం ఆయనకు పరిచయ మైంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వ్యక్తులను కలుసుకునే అవకాశం లభించటం ఆయనకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ప్రపంచస్థాయి ప్రమాణాలున్న విద్య శ్రీకాంత్‌కు లభించటమే కాదు.. ఆ క్రమంలోనే డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్పే అవకాశం కూడా దక్కింది. ఆ అనుభవం అతని వృత్తిపరమైన పథాన్ని, గమ్యాన్ని మార్చేసింది. డిగ్రీ విద్యార్థులకు బోధించే క్రమంలో.. తాను విద్యావేత్తగా ఎందుకు కాకూడదనే ఆలోచన వచ్చింది. ఇదే అతన్ని భారత్‌కు తిరుగు పయనమయ్యేలా చేసింది. విద్యార్థులు తనను తరగతిగదిలో అడిగిన క్లిష్టమైన ప్రశ్నలే.. అతన్ని ఉత్తమ బోధకుడిగా తీర్చిదిద్దాయి. ఈ విలువైన అనుభవాల నేపథ్యంలోంచే.. ఆయనిప్పుడు ఏపీలో మూడు విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తమ విద్యను అందిస్తూ విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.
బ్లూమింగ్టన్ ఇండియానా యూనివర్సిటీ నుంచి ‘ప్రొ.వెంకటేశ్ చొప్పెళ్ల’ కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ ప్రోగ్రాం చేశారు. అమెరికా విద్య అనేక విధాలుగా విశిష్టమైనదని చెప్పే వెంకటేశ్ ఐదు ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తారు. అవి.. అమెరికాలో యూనివర్సిటీ అధ్యాపక సిబ్బంది ఉపాధ్యాయులుగా, పరిశోధకులుగా చూపే నైపుణ్యం, సంక్లిష్టమైన నిబంధనలు, ప్రక్రియలు లేని అక్కడి యూనివర్సిటీ వ్యవస్థ; భిన్న నేపథ్యాలకు చెందిన విద్యార్థులు ఉండటానికి వీలైన సదుపాయాలు; విద్యార్థులకు యూనివర్సిటీలు అందించే అవకాశాలు, విద్యార్థి సమూహాల్లో ఉండే వైవిధ్యత. ఇప్పుడు ప్రొఫెసర్ చొప్పెళ్ల హైదరాబాద్‌లోని ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ‘అమెరికాలో దేశదేశాలకు చెందిన విద్యార్థులుంటారు. దీనివల్ల ఒక విద్యార్థికి తన స్వంత సంస్కృతితోపాటు, విభిన్న ప్రాంతాల, దేశాల సంస్కృతుల గురించి అవగాహన పెరుగుతుంది’ అని ఆయన చెబు తారు.
అమెరికా యూనివర్సిటీల నుంచి భారతీయ విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాలను, సామర్థ్యా లను నేర్చుకోగలిగారో వీరి అనుభవాలు తెలియజే స్తున్నాయి. ప్రపంచంలోనే యువత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో దక్షిణ మధ్య ఆసియా ఒకటి. ఈ ప్రాంతానికి చెందిన భారతదేశం నుంచి అమెరికాకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్తుంటారు. 2019-20 విద్యా సంవత్సరాన్ని తీసుకుంటే.. రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసించారు. భారతీ య విద్యార్థులు అమెరికా అంతటా కనిపిస్తారు. అయితే 2019-20కి సంబంధించి న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, మస్సాచూసెట్స్, ఇలినాయిస్ రాష్ర్టాలు టాప్ 5 జాబితాలో ఉన్నాయి.
తెలంగాణ-ఏపీలకు చెందిన అనేకమంది విద్యార్థులు అమెరి కాలో చదువుకున్నారు. కెరీర్లను నిర్మించుకున్నారు. కాబట్టి విదేశా ల్లో విద్యాభ్యాసం కోసం చూస్తుం టే అమెరికాను మించిన ప్రత్యా మ్నాయం లేదు. ఈ క్రమంలోనే భారతీయ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు దేశంలో 8 ‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ’ సలహా కేంద్రాలను ఏర్పాటు చేసి, 40 మంది సలహాదారులను అమెరికా నియ మించింది. ఈ సలహా కేంద్రం తాలూకు ‘అమెరికా-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్’ (యూఎస్ఐఈఎఫ్) కార్యాలయాన్ని నగరంలోని అమెరికా కాన్సులేట్‌లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.
ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి యూఎస్ఐఈఎఫ్, వై-యాక్సిస్ ఫౌండేషన్ తగు సలహాలిస్తూ తోడ్పాటునందిస్తున్నాయి.
(వ్యాసకర్త: అమెరికా కాన్సుల్ జనరల్, హైదరాబాద్)
‘డాక్టర్ అంజలీ ఖన్నా ఫర్బర్’ వైద్య విద్య కోసం అమెరికా వెళ్లి, ఇప్పుడు అక్కడే వైద్యవృత్తిని కొనసాగిస్తున్నారు. ‘నా చదువు, వైద్యవృత్తిలోనూ ఎమోరీ యూనివర్సిటీ నుంచి విలువైన అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందాను’ అని ఆమె చెప్తారు. అంజలి అట్లాంటా ఎమోరీ యూనివర్సిటీ నుంచి ‘పబ్లిక్ హెల్త్’లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఎమోరీ వైద్య విద్యార్థిగా ప్రజారోగ్య వ్యవస్థలో భాగంగా వివిధ దేశాలు, విభిన్న సాంస్కృతిక జీవనం కలిగిన వ్యక్తులను కలిసి వారికి వైద్య సేవలందించే అవకాశం ఆమెకు లభించింది. ‘ఇది నాకెంతో ఉపయోగపడింది. వేర్వేరు ఖండాల ప్రజా సమూహాలకు వైద్య సేవలందించే క్రమంలో వారినుంచి నేను ఎంతో నేర్చుకున్నా’ అని అంజలి తెలిపారు. ఆమె ప్రస్తుతం ఎమోరీ మెడిసిన్ స్కూల్లో పీడియాట్రిక్ నెఫ్రాలజీలో క్లినికల్ రీసెర్చ్ కో-ఆర్డినేటర్‌గా సేవలందిస్తున్నారు.
అమెరికాలో విద్యాభ్యాసం కోసం సంప్రదించాల్సిన వెబ్సైట్లు
https://educationusa.state.gov/centers/educationusa-usief-hyderabad
https://educationusa.state.gov/centerseducationusa-y-axis-foundation
జోయెల్ ఆర్ రీఫ్‌మన్