హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రెండున్నరేళ్లలో ఇండ్లు కూల్చడమే కానీ.. అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడం అంటే మీ అక్రమార్క ప్రణాళికను అడ్డుకోవడమే అని అన్నారు. ఫార్మాసిటీని కొనసాగిస్తామని కోర్టుకు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు.
ఫార్మా సిటీ కోసం మాత్రమే రైతులు భూములు ఇచ్చారని దేశపతి శ్రీనివాస్ తెలిపారు. మీ భూదందాల కోసం రైతులు భూములు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఫార్మాసిటీని రద్దు చేసిన భూములు తిరిగి ఇచ్చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేదా అని ప్రశ్నించారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఫార్మాసిటీ భూముల్ని మళ్లిస్తారా అని మండిపడ్డారు. మీ విధ్వంసాన్ని చక్కదిద్దే బాధ్యత మాపై ఉందని వ్యాఖ్యానించారు.