Khaja Mohijuddin| నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్లో అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్పై హత్యా ప్రయత్నం జరుగగా.. తీవ్ర గాయాలతో ఖాజా మొహిజుద్దీన్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మృతి చెందాడని తెలిసిందే.
ఈ నేపథ్యంలో దుండగుల చేతిలో హత్యకు గురైన లాయర్ ఖాజా మొయిజుద్దీన్ కేసులో సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ డీజీపీ సీవీ ఆనంద్కు లేఖ రాసింది. ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ లేఖలో కోరింది.
వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాటం..
హైకోర్టు , సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ఉన్న ఖాజా మొయిజుద్దీన్ కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా కారునంబర్ను ట్రేస్ చేస్తున్నారు.
హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖానే..
తన తండ్రి మొయిజుద్దీన్ హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖానే అని అతని కుమారుడు ఫర్హాన్ ఆరోపించాడు. మా తండ్రి వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాడని చెప్పిన ఫర్హాన్ వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆలం ఖాన్, అతడి తండ్రి ఆక్రమించి కాలేజీలు నిర్మించారని.. వాటి గురించి ఎప్పటినుండో కేసులు వేస్తూ.. మా ఫాదర్ ఖాజా మొయిజుద్దీన్ పోరాటం చేస్తున్నారని తెలిపాడు.
గత ఆరు నెలల క్రితం అలంఖాన్ మా ఆఫీసుకు వచ్చి నన్ను బెదిరించాడు. గతంలో మా ఆఫీసులకు వచ్చి మరీ దాడులు చేశారు.ఇప్పుడు నాకు గానీమా కుటుంబానికి కానీ ఏం జరిగినా ఆలం ఖాన్ దే బాధ్యత అని ఫర్హాన్ అన్నాడు. నాకు నా కుటుంబానికి రక్షణ కలిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఫర్హాన్ పేర్కొన్నాడు.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో హత్యకు గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కేసులో సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసిన హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ https://t.co/s8fEWaXI3C pic.twitter.com/PusiyvFWQY
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2026