ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. 24 గంటల్లో 4,524 కేసులు..
ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. దాదాపు నెలన్నర తర్వాత ఐదువేలకు దిగువన తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. దాదాపు నెలన్నర తర్వాత ఐదువేలకు దిగువన తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వైపు పాజిటివిటీ రేటు సైతం 10శాతం కంటే తక్కువగా పడిపోయింది. గత కొన్ని వారాల్లో కొవిడ్ పరీక్షలు సైతం తగ్గినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కోరారు. ఢిల్లీలో 24 గంటల్లో 4,524 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 5వ తేదీ తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కేసులు తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 340 మరణాలు రికార్డయ్యాయని ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.
24 గంటల్లో 53,756 టెస్టులు నిర్వహించినట్లు పేర్కొంది. గత నెలలో 30శాతానికి పైగా ఉన్న పాజిటివిటీ రేటు 24 గంటల్లో 8.42శాతానికి పడిపోగా.. ఏప్రిల్ 8 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయికి చేరింది. తాజాగా నమోదైన కేసులతో ఢిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13.98లక్షలు దాటగా.. 13.20లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 21,846 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 56,049 యాక్టివ్ కేసులు ఉండగా.. 35,141 హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆర్టీపీసీఆర్లో తేలకుంటే మరో టెస్టు
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
గుజరాత్లో భూకంపం
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా
విషాదం : హైదర్‌గూడలో అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ
జగన్నాథుడి దర్శనం.. జూన్ 15 వరకు బంద్
వచ్చే ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలోనే..!
‘తౌటే’పై సీఎం ఉద్ధవ్ సమీక్ష
షిర్డీ సాయిబాబా పేరిట ఆన్లైన్ మోసాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

