76 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఎండ
ఢిల్లీలో ఎండలు | దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 76 సంవత్సరాల తర్వాత మార్చిలో 40.1 డిగ్రీల

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 76 సంవత్సరాల తర్వాత మార్చిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. నగరంలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.1 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ అని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 31 మార్చి 1945లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలుగా రికార్డయిందని, ఆ తర్వాత దేశ రాజధానిలో మార్చిలో ఇదే అత్యంత ఉష్ణోగ్రత ఉన్న రోజని చెప్పారు.
అయితే గత మూడు నాలుగు రోజులుగా ఆకాశం నిర్మలంగా ఉండడం, గాలివేగం తక్కువగా ఉండడంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. 1973, మార్చి 29న నగరంలో గరిష్ఠంగా 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇది మార్చిలో మూడో అత్యంత వేడిమి ఉన్న రోజన్నారు. నజాఫ్‌గఢ్, నరేలా, పిటాంపురా, పూసాలోని వాతావరణ కేందాల్లోవరుసగా 41.8 నుంచి 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20.6 డిగ్రీలకు చేరాయి.
ఇది సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ. సాధారణం కంటే కనీసం 4.5 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే.. ‘హీట్ వేవ్’గా ప్రకటిస్తారు. సాధారణ ఉష్ణోగ్రత నుంచి 6.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే ‘తీవ్రమైన’ వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులు మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రతను 38 డిగ్రీలకు పడిపోతుందని శ్రీవాస్తవ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నాగార్జున సాగర్‌లో బీజేపీ చతికిల!
పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు..
నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ
హోలీ ఆడనివ్వలేదని అవ్వను చంపేశారు
ఆధార్ లింక్ లేకపోతే పాన్‌కార్డు చెల్లదు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

