న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ మొత్తంలో మత్తుమందు పట్టుబడింది. బుధవారం ఉదయం ఢిల్లీ పోలీస్‌కు చెందిన నార్కొటిక్స్ బృందం రాజధాని శివార్లలో హెరాయిన్ అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నది. వారి నుంచి ఆరు కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బ్రిజేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు. దాని విలువ సుమారు రూ.18 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితులపై కేసు నమోదుచేశామని, హెరాయిన్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయాన్ని తెలుసుకుంటున్నామని చెప్పారు.