న్యూఢిల్లీ : ఢిల్లీలోని పాత రాజేంద్ర నగర్లో ఉన్న రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో శిక్షణ తరగతులను, గ్రంథాలయాన్ని నిర్వహించిందని ఢిల్లీలోని ఓ కోర్టుకు శనివారం సీబీఐ తెలిపింది.
ఈ భవనంతోపాటు నగరంలోని అనేక కోచింగ్ సెంటర్ల భవనాలకు సేఫ్టీ సర్టిఫికేట్ లేదని తమ దర్యాప్తులో తెలిసిందని పేర్కొంది. గత నెలలో భారీ వర్షాలకు, రావూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తాతోపాటు మరో ఐదుగురిని నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది.