Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (Rekha Gupta) వివాదంలో చిక్కుకున్నారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎం భర్త మనీశ్ గుప్తా (Manish Gupta) హాజరుకావడం ఢిల్లీ రాజకీయాల్లో కలకలం రేపింది. సమావేశానికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆప్ (AAP) విరుచుకుపడింది.
సీఎం భర్తకు ప్రభుత్వంలో ఎటువంటి హోదా లేకున్నా.. అధికారిక సమావేశాలకు ఎందుకు అనుమతించారంటూ ఆప్ సీనియర్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనపై కాంగ్రెస్ను విమర్శించే బీజేపీ.. దీనికి ఏం సమాధానం చెప్తుందంటూ నిలదీశారు. ఇది కుటుంబ పాలన కాదా..? అంటూ ప్రశ్నించారు. భర్తకు ఎలాంటి అధికారాలు ఇవ్వాలని సీఎం రేఖా గుప్తా కోరుకుంటున్నారు..? అంటూ నిలదీశారు. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. ప్రధాని మోదీ ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించారంటూ ఆప్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయితే, ఆమె భర్త సూపర్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు.
दिल्ली सरकार बनी फुलेरा पंचायत
जैसे फुलेरा की पंचायत में महिला प्रधान के पति प्रधान की तरह काम करते थे , आज दिल्ली में CM के पति आधिकारिक मीटिंग में बैठ रहे हैं ।
हमने पहले भी बताया था कि CM आले पति आधिकारिक मीटिंग में बैठते हैं , अधिकारियों के साथ मीटिंग और इंस्पेक्शन करते… pic.twitter.com/40D3kz5OXU
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) September 7, 2025
Who is running the Government of Delhi? Is it Madame Rekha Gupta or her husband? pic.twitter.com/zMh1lHAmyZ
— Congress Kerala (@INCKerala) September 7, 2025
Also Read..
Gold Kalash | ఎర్రకోటలో భారీ చోరీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
Donald Trump | రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై రెండో దశ ఆంక్షలకు సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన