Little Hearts Collections | ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. థియేటర్లో రిలీజైన మొదటి వారాంతంలోనే భారీ కలెక్షన్లు రాబట్టి, అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్ ₹1.35 కోట్లు రాబట్టింది. సెకండ్ డే కలెక్షన్ ₹2.50 కోట్లు రాబట్టగా, సండే (3rd Day) ₹3.65 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్లో ₹7.50 కోట్ల నెట్ కలెక్షన్, ₹10 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఒక్క ఓవర్సీస్ నుంచే ₹3 కోట్లు వసూలు చేసింది ‘లిటిల్ హార్ట్స్’. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సినిమాకు వచ్చిన స్పందన చూస్తే వర్క్డేస్లో కూడా స్టడీగా కలెక్షన్లు రాబట్టే అవకాశముంది.
ఈ సినిమా కోటిన్నర బడ్జెట్‌తో ఓటీటీ కోసం రూపొందించబడింది. మొదటగా ఈటీవీ విన్లో రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత నిర్మాతలు బన్నీ వాస్ వద్దకు తీసుకెళ్లారు.ఆయనకు సినిమా నచ్చడంతో రెండున్నర కోట్లకు థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు. రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం, మూడో రోజే లాభాల్లోకి వెళ్లింది. మౌళి తనూజ్ ప్రశాంత్ మరియు శివాని నాగరం జంటగా మెప్పించారు.సాయి మార్తాండ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది.
వినోదం, ఎమోషన్, రొమాన్స్ అన్ని సరైన మేళవింపు ఉండడంతో, యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ వీకెండ్లోనే 10 కోట్ల గ్రాస్ సాధించడంతో, ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో “ఈ సినిమా పాతిక కోట్ల క్లబ్బులో చేరుతుందా?” అనే చర్చ ఊపందుకుంది. మరో 7–10 రోజుల్లో ఈ సినిమా ₹25 కోట్లు గ్రాస్ వసూలు చేయగలదని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. ఓటీటీ రిలీజ్ కోసం ప్లాన్ చేసిన చిన్న సినిమాగా మొదలై, థియేటర్లలో పెద్ద విజయం సాధించిన ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మౌత్ పబ్లిసిటీ, యూత్ కనెక్ట్, ఫన్-ఫీల్ గుడ్ కాన్సెప్ట్ ఇవన్నీ కలగలిపి సినిమా విజయంలో భాగం అయ్యాయి.