DEd Colleges Affiliation | హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 3: తెలంగాణ పాఠశాల విద్యా సంచాలకుల ఆదేశానుసారం గుర్తింపు పొందిన ప్రైవేట్ డీఎడ్ కళాశాలలు తమ అఫిలియేషన్ ఆఫ్ రెన్యూవల్(2025 -26 నుంచి 2028-29 వరకు) నాలుగు సంవత్సరాల కోర్సు నిర్వహించడానికి అఫిలియేషన్ ఫీజు గడువు ఈనెల 15 వరకు పొడిగించినట్టు ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండి.అబ్దుల్ వెల్లడించారు.
అఫిలియేషన్ ఫీజు రూ.లక్ష (రూ.1,00,000) రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్, ,బ్యాంకు చెక్కు ద్వారా ‘ద ఛైర్పర్సన్ ఆఫ్ ద అఫిలియేషన్ కమిటీ అండ్ ద డీఎస్ఈ, తెలంగాణ హైద్రాబాద్’ పేరిట ఏదేని నేషనలైజ్డ్ బ్యాంకు ద్వారా పంపించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
సంబంధిత ఫీజుతో పాటు అఫిలియేషన్ ప్రపోజల్ మెంబర్ కన్వీనర్ (సంచాలకులు, ఎస్ఈఈఆర్టీ తెలంగాణ, హైదరాబాద్ వారికి పంపాలన్నారు. అఫిలియేషన్ ప్రపొజల్తో పాటు ఎన్సీటీఈ రికగ్నిషన్ ఆర్డర్, డిస్ కంటిన్యూడ్ అయిన ప్రైవేట్ డీఎడ్ కాలేజీలు కారణాలు తెలియజేస్తూ రూ.100 బాండ్పేపర్ సమర్పించాలన్నారు. ఎన్సీటీఈ-2014 నిబంధనల ప్రకారంగా అన్ని సంబంధిత ప్రతులను సమర్పించాల్సి ఉంటుందన్నారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు