హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): బీసీ బంద్ అనంతరం అర్ధరాత్రి వేళ 8మంది బీసీ జేఏసీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, ఉద్యమాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్ కుట్రలకు తెరతీసిందని బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్ మండిపడ్డారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. 18న నిర్వహించిన తెలంగాణ బీసీ బంద్ అనంతరం 8 మంది బీసీ జేఏసీ నేతలకు ఎలాంటి సమాచారమివ్వకుండా నిర్బంధించారని వాపోయారు. వరంగల్ జిల్లా ఉర్సు ప్రాంతంలో ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.