వార్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రం సీతారామమ్ (Sita Ramam). హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా మలయాళ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా స్పెషల్ వీడియో ద్వారా ప్రకటించారు. మా డార్లింగ్ ప్రభాస్..సీతారామం కోసం రేపు సాయంత్రం 7 గంటల నుంచి..అంటూ ట్వీట్ చేసింది వైజయంతీ మూవీస్.
ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ అక్కినేని కనిపించనుండగా..అతడి భార్య పాత్రలో భూమిక చావ్లా నటిస్తోంది. తరుణ్ భాస్కర్ ఈ మూవీలో బాలాజీ పాత్రలో నటిస్తుండగా, రష్మిక కశ్మీరీ యువతి అఫ్రీన్ పాత్రలో మెరువనుంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ కీ రోల్ పోషిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్. సీతారామం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
𝑶𝒖𝒓 𝑫𝒂𝒓𝒍𝒊𝒏𝒈 ♥️#PrabhasForSitaRamam
See you tomorrow.#SitaRamam @dulQuer @mrunal0801 @iSumanth @iamRashmika @hanurpudi @AshwiniDuttCh @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @DQsWayfarerFilm @LycaProductions pic.twitter.com/al16WdU6VX
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 2, 2022