సైయెంట్ లాభం 132 కోట్లు

హైదరాబాద్, జనవరి 20: ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.131.70 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.95.40 కోట్ల లాభంతో పోలిస్తే 38 శాతం అధికమని కంపెనీ పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.3 శాతం ఎగబాకి రూ.1,183.40 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఇది రూ.1,044.30 కోట్లుగా ఉన్నది. కీలక విడిభాగాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయని, ఆర్డర్లలో 16 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గత త్రైమాసికంలో రూ.1,690 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. నాలుగో త్రైమాసికంపై ఆశావాదంగా ఉన్నట్లు కంపెనీ ఈడీ, సీఎఫ్‌వో అజయ్ అగర్వాల్ తెలిపారు.
అంచనావేసిన స్థాయిలోనే ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. గత త్రైమాసికంలో 157.90 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది. గతేడాదితో పోలిస్తే 11.7 శాతం అధికం. సేవల రంగంతోపాటు సెమికండక్టర్, గనులు, మెడికల్ టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాలు వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
- – కృష్ణ బొడనపు, సైయెంట్ ఎండీ, సీఈవో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

