Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Cyclone Arnab | తీరానికి చేరువైన అర్నబ్ తుపాను (Cyclone Arnab) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు బీచ్‌లను అధికారులు మూసివేశారు. విశాఖపట్నం సహా పలు తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మరోవైపు సముద్రం ముందుకు వస్తుండటంతో పర్యాటకుల ప్రవేశంపై అధికారులు ఆంక్షలు విధించారు
Cyclone Arnab : తీరానికి చేరువైన అర్నబ్ తుపాను (Cyclone Arnab) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు బీచ్‌లను అధికారులు మూసివేశారు. విశాఖపట్నం సహా పలు తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మరోవైపు సముద్రం ముందుకు వస్తుండటంతో పర్యాటకుల ప్రవేశంపై అధికారులు ఆంక్షలు విధించారు. విశాఖలోని రుషికొండ, ఆర్కేబీచ్లతోపాటు బాపట్ల జిల్లాలో చీరాల, ఓడరేవు, రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశారు.
హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు విశాఖ సందర్శనకు రావద్దని అధికారులు సూచించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు బీచ్‌లలో ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. తుపాను ప్రభావం కారణంగా అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపలవేటను నిలిపివేశారు. బోట్లను ఒడ్డుకు చేర్చారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ జెట్టీ, కొత్తపాలెం, నక్షత్రనగర్, లంకెవానిదిబ్బ, పెనుమూడిలో బోట్లను ఒడ్డుకు తీసుకొచ్చారు.
కాకినాడ జిల్లాలో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 101 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. కాకినాడ కలెక్టరేట్లో 0884-2356801, 98499 03879 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక తుపాను ఎఫెక్ట్‌తో విశాఖపట్నంలో ఇప్పటికే ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని మహారాణిపేట అంగడిదిబ్బ వద్ద చెట్టు విరిగిపడి పాన్ షాపు ధ్వంసమైంది. ఈ క్రమంలో సహాయక చర్యలకు విద్యుత్‌శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఆదేశించారు.
అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలకు సామగ్రి, యంత్రాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. విద్యుత్ సమస్యలు ఉంటే 1912 నంబర్‌ను సంప్రదించాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

