Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
Teachers | హైదరాబాద్ జిల్లా పరిధిలో విద్యా వ్యవస్థ గాడితప్పింది. ఇక్కడి టీచర్లపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కరువైంది. కొత్తగా వచ్చిన డీఈఓకు సైతం మరికొన్ని రోజుల్లో పదోన్నతి రాబోతుండటంతో ఇక్కడి కొందరి టీచర్ల రాజకీయాల్లో తలదూర్చకూడదని ఆయన మౌనం వహిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లా పరిధిలో విద్యా వ్యవస్థ గాడితప్పింది. ఇక్కడి టీచర్లపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కరువైంది. కొత్తగా వచ్చిన డీఈఓకు సైతం మరికొన్ని రోజుల్లో పదోన్నతి రాబోతుండటంతో ఇక్కడి కొందరి టీచర్ల రాజకీయాల్లో తలదూర్చకూడదని ఆయన మౌనం వహిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల డీఈ ఓ ఆదేశాలతో 25 మంది టీచర్లను డిప్యుటేషన్ కింద పంపిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఆ ఉత్తర్వుల్లో ఒక్క సబ్జెక్ట్ బోధించే టీచర్‌కు బదులు మరో టీచర్ పేరు ఉండటంతో ఆ ఉత్వర్వులు చర్చ నీయాంశంగా మారాయి. అయితే ఈ ఉత్త ర్వుల్లో కొందరు కిందిస్థాయి అధికారులు కావాలనే తప్పుడు సమాచారం డీఈఓకు అందించినట్టు తెలిసింది. కొత్తగా విధుల్లోకి వచ్చిన డీఈఓ యాదయ్య.. రెండు నెలల క్రితం 69 మంది టీచర్లను ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేసే ప్రక్రియ చేపట్టారు. అందులో ఖాళీ ఉన్న స్కూళ్లలో టీచర్లను కేటాయిస్తూ లిస్ట్ రెడీ చేశారు. ఇక్కడే డీఈఓపై కొన్ని ఉపా ధ్యాయ సంఘాలు దృష్టి సారించాయి.
స్థానిక అధికార పార్టీ అండదండలతో ఒకే స్కూళ్లో తిష్టవేసిన టీచర్లను మరోచోటుకి కదిలించడం వివాదస్పదమైంది. డీఈఓ ఆదేశాలిచ్చినా తాము వెళ్లే ప్రసక్తే లేదని కొందరు టీచర్లు ఆ ఆదేశాలను బేఖాతరు చేశారు. ఈ విషయం డీఈఓ దృష్టికి వచ్చినా ఆయన ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. మంత్రులు, ఎంపీలతో పైరవీలు చేయిస్తూ మరో స్కూల్‌కు వెళ్లేది. లేదని డీఈఓకు నేరుగా చెప్పేసినట్టు తెలి సింది. ఇంకొందరు ఎంపీలు, మంత్రులతో ఫోన్లు చేయించి తమ పేర్లు లిస్ట్‌లో నుంచి తొలిగించుకున్నట్టు తెలిసింది. మొత్తంగా కొందరి టీచర్ల పంచాయితీ తేలకపోవడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతుందని విమర్శలున్నాయి.
అదనపు బాధ్యతలతో సమస్యలు..
హైదరబాద్ జిల్లాలో చాలామంది ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జి డిప్యూటీ ఈఓలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో 12 మంది డిప్యూటీ ఈఓ (డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్), 24 డిప్యూటీ ఐఓఎస్(ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక హెచ్ఎం ఒక మండలంలో డిప్యూటీ ఈఓగా ఉంటూనే మరో పోస్టు డీఐఓఎస్ బాధ్య తలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఈ అదనపు భారంలో భాగంగా వాళ్లు వాళ్ల మండల పరి ధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌ను పరిశీలిం చాల్సి ఉంటుంది. సిలబస్, టీచర్ల పనితీరు, ఫీజల వసూళ్లు తదితరపై రిపోర్టు రెడీ చేసి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందిం చాల్సి ఉంటుంది. ఈ భారం అంతా ప్రధానోపాధ్యాయులపై పడుతుండటంతో తాము ఏ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నామో అక్కడ న్యాయం చేయలేకపోతున్నామని చెబుతు న్నారు. సాధారణంగా జిల్లాలో పరిపాలన అధి కారుల కొరత వెంటాడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల బోధనా సామర్థ్యాలు, ఉపాధ్యాయుల పనితీరును నిత్యం పర్యవేక్షిం చాల్సిన డిప్యూటీ ఈఓలు, డిప్యటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(డీఐఓస్ లు) పర్మనెంట్ లేకపో వడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పర్యవేక్షణ కరువై విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతోందనే విమర్శలున్నాయి. పర్మనెంట్ పోస్టులను భర్తీ చేసి తమపై ఒత్తిడి తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
డిప్యూటీ ఈఓ, ఐఓఎస్ వసూళ్ల పర్వం..!
నగరంలో గుర్తింపులేని పాఠశాలలు వందల్లో ఉన్నాయి. గుర్తింపు ఉన్న పాఠ శాలలు సైతం అనేక నిబంధనలు తుంగలో తొక్కుతూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటన్నింటిని చూసీచూడ నట్టు వ్యవహరిస్తున్నందుకు సదరు పరి ధిలోని కొందరు డిప్యూటీఈఓ, డిప్యూటీ ఐఓఎస్ కు మాముళ్లు అందిస్తున్నట్టు ఓ ప్రయివేట్ స్కూల్ సిబ్బంది తెలిపారు.
సాధారణంగా పాఠశాల స్థాపించాలంటే విద్యాశాఖ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మద్యం దుకాణాలు, ప్రార్ధన మందిరా లకు పాఠశాల దూరంగా ఉండాలి. 24 శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ ఓసీ) తీసుకోవాలి. భవన రిజిస్ట్రేషన్, ఫైర సేఫ్టీ తప్పనిసరి. అయితే నగరంలో చాలా పాఠశాలలను కేవలం లాభార్జన మీదనే నెలకొల్పుతున్నారు. హైదరాబా ద్లో మొత్తం 2,374 ప్రయివేట్ స్కూళ్లు ఉంటే ఇందులో 1897 పాఠశాలలకే గుర్తింపు ఉంది. ఇందులో 477 పాఠశా లలకు గుర్తింపు లేదని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. ఈ విషయం విద్యా శాఖాధికాలకు దృష్టిలో ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..!
KING Movie | క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. కొత్త పోస్టర్ విడుదల.!
Amritsar: గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ సర్పంచ్ సోదరుడి కాల్చివేత
Hyderabad | హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై అఘాయిత్యం.. స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

