Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: శివుడి త్రిపుండ్రం పిక్‌ను రాహుల్ గాంధీ తన ఎక్స్‌లో ఇవాళ పోస్టు చేశారు. దానికి సత్యం శివం సుందరం అని రాశారు. అయితే 2018 నాటి పరువునష్టం కేసులో సుల్తాన్పూర్ కోర్టు అతన్ని నిర్దోషిగా సోమవారం తేల్చిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: శివుడి విభూతి తిలకం పిక్‌ను రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన ఎక్స్‌లో ఇవాళ పోస్టు చేశారు. దానికి సత్యం శివం సుందరం అని రాశారు. అయితే 2018 నాటి పరువునష్టం కేసులో సుల్తాన్పూర్ కోర్టు అతన్ని నిర్దోషిగా సోమవారం తేల్చిన విషయం తెలిసిందే. త్రిపుండ్రం తిలకం పోస్టు వెనుక ఉన్న మర్మం స్పష్టంగా తెలియడంలేదు. కానీ ఓటర్ల జాబితా సవరణ సర్ ప్రక్రియకు చెందిన పిల్‌ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయన పోస్టు చేసి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే 2018లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో సోమవారం ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పును ఇచ్చింది.
सत्यम् शिवम् सुन्दरम् https://t.co/pIfskmfzAt
— Rahul Gandhi (@RahulGandhi) October 27, 2026
2018లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ మిశ్రా క్రిమినల్ పరువునష్టం కేసు బుక్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు చేశారు. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో 2023లో రాహుల్ గాంధీ కోర్టు ముందు హాజరయ్యారు. ఆ తర్వాత బెయిల్ తీసుకున్నారు. తొలుత అక్టోబర్ 13వ తేదీన తీర్పును వెలువరించాల్సి ఉంది. కానీ అక్టోబర్ 26వ తేదీకి మార్చారు. రాహుల్ గాంధీ తరపున సీనియర్ అడ్వకేట్లు ఆర్ఎస్ చీమా, అడ్వకేటు కాశి శుక్లా, తరన్నుమ్ చీమా, ప్రసన్న ఎస్, ఆకాశ్ సింగ్ వాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..!
KING Movie | క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. కొత్త పోస్టర్ విడుదల.!
Amritsar: గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ సర్పంచ్ సోదరుడి కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

