AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
AP News | ముంచుకొస్తున్న 'అర్నబ్ తుపాను (Cyclone Arnab)' ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా చూడటమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు.
AP News : ముంచుకొస్తున్న ‘అర్నబ్ తుపాను (Cyclone Arnab)’ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా చూడటమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన విభాగాలతో సమన్వయం చేసుకుంటూ తాము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. తీరప్రాంత ప్రజలను అవసరమైనప్పుడు వెంటనే తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని, అక్కడ స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్ 1070, 112ను సంప్రదించాలని మంత్రి అనిత సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..!
KING Movie | క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. కొత్త పోస్టర్ విడుదల.!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

