Vaccination Drive: వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పరిశీలించిన సీఎస్ సోమేశ్‌కుమార్
బీఆర్కే భవన్లో ఉద్యోగుల కోసం చేపట్టిన రెండో విడత వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు.

హైదరాబాద్: బీఆర్కే భవన్లో ఉద్యోగుల కోసం చేపట్టిన రెండో విడత వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌తో సహా సచివాలయ ఉద్యోగులకు జూన్ 11, 12 తేదీల్లో రెండురోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఏర్పాటు చేసి మొదటి విడత టీకాలు పంపిణీ చేశారు.
ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్ల ఉద్యోగులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీఏడీ జాయింట్ సెక్రెటరీ చిట్టిరాణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

