హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందారు. టేకులపల్లి మండలం రోళ్లపాడు క్రాస్ వద్ద మంగళవారం అర్ధరాత్రి మాలోతు జగదీశ్బాబు (30) మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి క్రాస్ రోడ్డు వద్ద కల్వర్టును ఢీకొని కాల్వలో పడిపోయింది. తీవ్ర గాయాలకు గురైన జగదీశ్బాబు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయన స్వస్థలం టేకులపల్లి మండలం మద్రాస్తండా. ఆయన చెన్నైలో విధులు నిర్వర్తిస్తుండగా.. పదో తరగతి సర్టిఫికెట్లో సమస్యలు రావడంతో ఆయన మూడు రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లల ఉన్నారు. సెలవుపై వచ్చి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించడంతో కుటుంబంలో విషాదం అలుముకున్నది.