జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’.అరుణ్ విక్కీరాల దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌గా చిత్రాన్ని తెరకెక్కి స్తున్నాం. బతకడం కోసం చంపడం సృష్టి ధర్మం, మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది అని టీజర్లో వున్న డైలాగ్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. తప్పకుండా చిత్రం కూడా అందరిని అలరించే విధంగా వుంటుంది’ అన్నారు. శివ బాలాజీ, మనోహరన్, డోలీషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మోహిత్ రెహ్మాణియక్.