Crime news | నీ కొడుకే నీకు ప్రమాదమని చెప్పిన జ్యోతిష్యుడు.. కన్నకొడుకును చంపి నదిలో పడేసిన తండ్రి..!
Crime news | కొడుకు ద్వారా తనకు ప్రమాదం ఉందని జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి.. ఓ తండ్రి కన్నబిడ్డను చంపి నదిలో పడేసిన దారుణ ఘటన తమిళనాడు (Tamil Nadu) లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తేని నగరం (Theni City) లోని ఎంజీఆర్నగర్కు చెందిన 50 ఏళ్ల వేందర్ బాలా (Vendar Bala) 'తమిళగ మక్కళ్ మున్నేట్ర కళగం (TMMK)' పార్టీ నాయకుడు. అతని మొదటి భార్య రాజలక్ష్మి (Rajalaxmi) కుమారుడు అయిన 20 ఏళ్ల శ్రీకాంత్ (Srikanth) ఆస్తి విషయంలో తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు కనిపించకుండా పోయాడు.
Crime news : కొడుకు ద్వారా తనకు ప్రమాదం ఉందని జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి.. ఓ తండ్రి కన్నబిడ్డను చంపి నదిలో పడేసిన దారుణ ఘటన తమిళనాడు (Tamil Nadu) లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తేని నగరం (Theni City) లోని ఎంజీఆర్నగర్కు చెందిన 50 ఏళ్ల వేందర్ బాలా (Vendar Bala) ‘తమిళగ మక్కళ్ మున్నేట్ర కళగం (TMMK)’ పార్టీ నాయకుడు. అతని మొదటి భార్య రాజలక్ష్మి (Rajalaxmi) కుమారుడు అయిన 20 ఏళ్ల శ్రీకాంత్ (Srikanth) ఆస్తి విషయంలో తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు కనిపించకుండా పోయాడు.
దాంతో 2023 సెప్టెంబర్‌లో శ్రీకాంత్ అదృశ్యమయ్యాడని తల్లి రాజలక్ష్మి మదురై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కోర్టు ఆదేశాలతో 2026 ఫిబ్రవరిలో ఈ కేసు దర్యాప్తు సీబీసీఐడీకి బదిలీ అయింది. శ్రీకాంత్‌కు, తేనికి చెందిన అలెక్స్‌పాండియన్ అనే వ్యక్తికి మధ్య పాతకక్షలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దాంతో పోలీసులు అలెక్స్పాండియన్ను అరెస్టు చేసి విచారించారు. దాంతో అతను.. తాను, శ్రీకాంత్ తండ్రి వేందర్ బాలా, ముల్లైనగర్కు చెందిన కరుప్పయ్య కలిసి హత్య చేసినట్లు అంగీకరించాడు.
హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి ముల్లైపెరియార్ నదిలో పడేసినట్లు తెలిపాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు వేందర్ బాలాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దాంతో అతడు.. ఓ జ్యోతిష్యుడి వద్ద జాతకం చూపించుకోగా కుమారుడితో తనకు ప్రమాదం ఉందని చెప్పాడని, అందుకే స్నేహితుడు కరుప్పయ్య సాయంతో శ్రీకాంత్‌ని గొంతు నులిమి హత్యచేసినట్లు అంగీకరించాడు. కరుప్పయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

