హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లోని క్రెడిట్స్‌కు కోతపడనున్నది. క్రెడిట్స్‌ను 142 నుంచి 120కి తగ్గించనున్నారు. కొన్ని పాఠ్యాంశాలను తొలగించడమే కాకుండా, సిలబస్‌ను తగ్గించనున్నారు. డిగ్రీ కోర్సుల క్రెడిట్స్‌ను తగ్గించేందుకు ఓ కమిటీని నియమించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు.
కమిటీ సూచనల మేరకు క్రెడిట్స్‌ను తగ్గించబోతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఏడాదికి 142 క్రెడిట్స్ ఉన్నాయని, రెండు సెమిస్టర్లుండగా, 22 క్రెడిట్స్‌ను తగ్గించనుండటంతో సెమిస్టర్‌కు 11 చొప్పున క్రెడిట్స్ తగ్గించాల్సి ఉంటుందని వెల్లడించారు. దీంతో సిలబస్‌ను కూడా తగ్గిస్తామని, కొన్ని పాఠ్యాంశాలు తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్రెడిట్స్‌ను తగ్గించిన తర్వాత అన్ని వర్సిటీల్లో కామన్ క్రెడిట్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ 11 కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
2026-27 విద్యాసంవత్సరంలో ఈ కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. కోర్సులను నిర్వహించేందుకు ఆసక్తి గల కాలేజీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరిన వారి కోసం ప్రత్యేక రీడింగ్ మెటీరియల్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బోధనకు ఏఐ సాంకేతికత వినియోగిస్తామని వెల్లడించారు. కొత్త కోర్సులను నిర్వహించేందుకు ఆసక్తి గల కాలేజీలు 23లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
కొత్త కోర్సులివే..