CPM | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 1 1 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక కొరత తీవ్రమైందని, ఇందిరమ్మ ఇళ్లు, ప్రైవేటు గృహ నిర్మాణ పనులు నిలిచిపోయాయని సీపీఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్న దాస్ గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా సిరిసిల్ల పట్టణంలో ఇసుక అనుమతులు లేకపోవడంతో నిర్మాణాలు స్తంభించాయని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇసుక, ఇతర నిర్మాణ ముడిసరుకుల ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీపీఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాలో అన్న దాస్ గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పనులకు ఇస్తున్న ఇసుక బ్లాకులో రూ. 4 వేల నుండి రూ. 5 5వేలకు అమ్ముడుపోతోందని ఆరోపించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు కేవలం 10 ట్రాక్టర్ల ఇసుక మాత్రమే ఇస్తామని చెబుతున్నారని, అయితే సిరిసిల్ల పట్టణంలో నల్ల రేగడి భూములు కావడంతో పునాదులకే 10 ట్రిప్పుల ఇసుక సరిపోవడం లేదని వివరించారు.
ప్రభుత్వం మరోసారి ఆలోచించి ఇసుక ట్రిప్పుల సంఖ్యను పెంచాలని, అలాగే ప్రైవేట్ ఇంటి నిర్మాణాలకు కూడా ప్రతిరోజూ ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనివల్ల పట్టణంలోని పేద ప్రజలపై పడుతున్న అదనపు భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇతర ముడి సరుకుల ధరలను కూడా నియంత్రించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మైనింగ్ అధికారులు దాడులను ఆపాలని సీపీఎం నాయకులు కోరారు. పేదల ఇంటి నిర్మాణాలకు, అలాగే ప్రైవేటు ఇంటి నిర్మాణదారులకు ఇబ్బందులు లేకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఎం సిరిసిల్ల జిల్లా కమిటీ తరపున తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, ఎగమాంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, శ్రీరామ్ రమేష్ చంద్ర, సీపీఎం సీనియర్ నాయకులు మిట్టపెల్లి రాజమల్లు, రాపెల్లి రమేష్, నక్క దేవదాస్, జిందాం కమలాకర్, బెజగం సురేష్, సిరిమల్లా సత్యం, కోలా శ్రీనివాస్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!