సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : కొవిడ్-19 మూడో వేరియంట్ (ఒమిక్రాన్) బారిన పడకుండా సిబ్బంది అందరూ కచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలు పాటించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందికి సూచించారు. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కొవిడ్-19 మొదటి, రెండవ వేవ్ బారిన పడిన సిబ్బంది ఆత్మైస్థెర్యంతో పూర్తి ఆరోగ్యవంతులుగా బయటపడ్డారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్, మాస్కు వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపారు. ఈసమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ నర్మదా, పోలీస్ వైద్యులు అచ్యుతారావు, ఏసీపీ విజయ్శ్రీనివాస్, ఆర్ఐ నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.