భారత్‌కు ప్రయాణాలపై ఇజ్రాయిల్ నిషేధం
భారత్‌కు ప్రయాణాలపై ఇజ్రాయిల్ నిషేధం | పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో భారత్‌కు వెళ్లకుండా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, కెనడా, యూఏఈ, అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించగా.. ఇజ్రాయిల్ సైతం అదే బాటపట్టింది.

జెరూసలేం : పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో భారత్‌కు వెళ్లకుండా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, కెనడా, యూఏఈ, అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించగా.. ఇజ్రాయిల్ సైతం అదే బాటపట్టింది. తన పౌరులు భారత్ సహా ఆరు దేశాలకు వెళ్లకుండా నిషేధం విధించింది. ఆరు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి కార్యాలయం, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయిల్ పౌరులు ఉక్రెయిన్, బ్రెజిల్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా, భారత్, మెక్సికో, టర్కీకి వెళ్లకుండా నిషేధం విధించింది.
ఆంక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. అయితే, ఇజ్రాయిల్యేతర పౌరులు ఆయా దేశాలకు వెళ్లొచ్చని, ప్రస్తుతం ప్రయాణం కోసం ఎయిర్‌పోర్టుల్లో వేచి ఉన్నవారికీ ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఏడు దేశాల నుంచి తిరిగివచ్చే వారు రెండు వారాల పాటు తప్పనిసరిగా కార్వంటైన్‌లో ఉండాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కరోనా నుంచి కోలుకున్నవారు, టీకా తీసుకున్నవారికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే, రెండు కరోనా నెగెటివ్ రిపోర్టులు ఉన్నవారికి క్వారంటైన్ కాలపరిమితిని పది రోజులుగా నిర్ణయించినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి మూడు రోజులు వర్ష సూచన
జడ్జిమెంట్ డే
ఆక్సిజన్ గంట ఆలస్యం.. గాల్లో కలిసిన 12 ప్రాణాలు
కరోనాపై పదిలం
మూడో దశలో ఒకే రోజు 84వేల మందికి వ్యాక్సిన్
కరోనా ఎఫెక్ట్.. 25 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

