అమరావతి : ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపులిద్దరూ ( Couple Died) దుర్మరణం చెందారు. ఏలూరు జిల్లా (Eluru district ) కొయ్యలగూడెం శివారు పులి వాగు వద్ద నుంచి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గాడాల నుంచి జంగారెడ్డిగూడెంవైపు వెళ్తున్న ద్విచక్రవాహానాన్ని ఆటో ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో దంపతులు జయరాజు(52), సత్యవతి(45) మృతి చెందారు. మృతదేహాలను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనవరాలి అన్నప్రాసనానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.