Muncipal Elections : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎర్లి ట్రెండ్స్‌ను బట్టి చూస్తే బీఆర్ఎస్కు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు గడ్డిపోతారంలో 5 వార్డులు, ఇబ్రహీంపట్నంలో 3 వార్డులను బీఆర్ఎస్ గెలిచింది.
అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏలే భువనేశ్వరి విజయం సాధించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి రమేష్ జయకేతనం ఎగురవేశారు. ఎర్లీ ట్రెండ్స్ బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు కనిపిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో 7, 10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1 వ వార్డులో కాంగ్రెస్ గెలిచింది.