కీవ్, ఏప్రిల్ 1: రష్యా భూభాగంలోని ఓ ఇంధన డిపోపై ఉక్రెయిన్ హెలికాప్టర్లు బాంబులు వేశాయని ఆ దేశ బెల్గోరడ్ గవర్నర్ వ్యచెసేవ్ గ్లడ్కోవ్ ఆరోపించారు. ఇరుదేశాల సరిహద్దుకు 35 కిలోమీటర్ల ప్రాం తంలో జరిగిన ఈ ఘటనలో డిపోలో మంటలు చెలరేగడంతో పాటు ఇద్దరికి గాయాలయ్యాయన్నారు. ఈ దాడులను క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా ధ్రువీకరించారు. దాడి ఆరోపణలపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో స్పంది స్తూ.. ఘటనపై తనకు సమాచారం లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ తూర్పు నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మరియుపోల్ నుంచి పౌరులతో బయల్దేరిన 45 బస్సుల కాన్వాయ్‌ను రష్యా బలగాలు అడ్డుకున్నా యి. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు శుక్రవారం వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా మళ్లీ ప్రారంభమయ్యాయి.
రష్యాతో ఉక్రెయిన్, ఇతర దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు ముప్పు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఆస్ట్రేలియా, నెదర్లాండ్ చట్టసభలను ఉద్దేశిం చి మాట్లాడారు. రష్యా దాడికి వ్యతిరేకంగా తమకు అండగా నిలవాలని కోరారు. ఉక్రెయిన్‌కు సాయుధ వాహనాలు పంపుతామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ శుక్రవారం ప్రకటించారు.
భారత్ పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గేయ్ లావ్రోవ్ శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు అంశాలపై వీరిరు వురూ చర్చించుకున్నారు. అంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో లావ్రోవ్ భేటీ అయ్యారు. రష్యా భారత్ నుంచి ఏం కొనాలన్నా పంపిస్తామని, దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని లావ్రోవ్ పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య భారత్ మధ్యవర్తిత్వం కూడా వహించొచ్చన్నారు. ఇప్పటికే డిస్కౌంట్‌తో భారత్‌కు చమురు ఇచ్చేందుకు అంగీకరించిన రష్యా.. మరింత చౌకగా అందించేందుకు ఆఫర్ చేసింది.