ప్రస్తుతం మీ వయసు 30 ఏైండ్లెతే.. మీ పదవీ విరమణ అనంతరం నెలకు రూ.2 లక్షల పెన్షన్ కోసం రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ అవసరం.ఇందుకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అనువైనదిగా చెప్పవచ్చు. ఎన్పీఎస్ అనేది స్టాక్ మార్కెట్ లింక్డ్ స్కీమ్. ఇందులో పెట్టిన పెట్టుబడుల సగటు వార్షిక వృద్ధి ఏటా 10 శాతంగా ఉంటున్నది. అందుకే మెరుగైన మీ పెన్షన్ అవసరాలకు ఎన్పీఎస్ సరైనదని ఆర్థిక నిపుణులు సైతం అంటున్నారు.
నెలకు రూ.22,150
నెలనెలా దాదాపు రూ.22,150ని పెట్టుబడిగా పెడితే 30 ఏండ్లలో మీ పెట్టుబడులు రూ.5 కోట్లకు చేరుతాయి. చక్రవృద్ధి ప్రయోజనం ఇదే మరి. 30 ఏండ్లలో మీ పెట్టుబడులు రూ.79.74 లక్షలు. దీనిపై ఏటా 10 శాతం వృద్ధితో మరో రూ.4.21 కోట్లు సమకూరుతాయి. దీంతో కార్పస్ ఫండ్ రూ.5 కోట్లుగా ఉంటుంది. అప్పుడు నెలనెలా మీ రిటైర్మెంట్ వయసులో రూ.2 లక్షల పెన్షన్‌ను అందుకోవచ్చని పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
ఇదీ సంగతి..
మీరు రిటైరైనప్పుడు మీకు రెండు మార్గాలుంటాయి. అవి ఓ యాన్యుటీ ప్లాన్‌లో మీ మొత్తం సొమ్మును పెట్టుబడిగా పెట్టి పెన్షన్ తీసుకోవడమో లేదా రిటైరైన తర్వాత వచ్చిన ఆ సొమ్ములో 60 శాతం ఉంచుకుని, మిగతా 40 శాతంతో యాన్యుటీ ప్లాన్‌లో చేరడమో అవుతుంది. అయితే ప్రస్తుత ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) రేట్లను గమనిస్తే.. ఇంకా 6-7 శాతంగానే ఉన్నాయి. ఎఫ్‌డీల్లో నగదును పెట్టడం సురక్షితమే అయినా.. ఆశించిన లేదా ఆకర్షణీయ రాబడులు రావు. దీనికన్నా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. అయితే ఎన్పీఎస్.. మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో మెరుగైన రాబడులనే అందిస్తుందన్న నమ్మకం పెట్టుకోవచ్చు. కానీ పెట్టుబడులకు దిగే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకుంటే మరింత ధీమాగా ఉండవచ్చు.