హైదరాబాద్ : కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న టిమ్స్ ఆస్పత్రి సేవలపై రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఓ ఇద్దరు దంపతులు టిమ్స్‌లో చికిత్స అందుకొని కోలుకున్న తర్వాత.. అక్కడి సేవలను వివరిస్తూ ఓ వీడియోను చేశారు. ఈ వీడియోను వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.
మార్చి 28న హైదరాబాద్‌కు చెందిన రమేశ్, మంజుల దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారిద్దరూ గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చేరారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఏప్రిల్ 4న టిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా వారు ఓ వీడియోను విడుదల చేశారు. టిమ్స్‌లో వైద్య సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. డాక్టర్లతో పాటు ఇతర సిబ్బంది తమకు మనోధైర్యం ఇచ్చారని తెలిపారు. టిమ్స్‌లో రూమ్స్, వాతావరణం చాలా బాగుందన్నారు. రోజుకు మూడు సార్లు చెకప్ చేసి మెడిసిన్ ఇస్తున్నారని, అక్కడ పని చేస్తున్న డాక్టర్లకు హ్యాట్సాఫ్ చెప్పారు ఆ దంపతులు.
A big thanks to #TIMS, Gachibowli for providing excellent healthcare service to #COVID19 patients free of cost. Myself and my wife got admitted on March 28 at TIMS and got discharged today April 4 after recovering from COVID-19.@TelanganaCMO @Eatala_Rajender @trspartyonline pic.twitter.com/Xi2UQ7lj8T
— EATALA Office (@EATALAOffice) April 4, 2021
ఇవి కూడా చదవండి..