యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడం కోసం విరాళాలల సేకరనకు భక్తుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తమతమ విరాళాలు స్వామివారికి సమర్పిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన డెబ్బన రామకృష్ణారెడ్డి రూ. 2,00,000 విరాళం సమర్పించారు. ఈ మేరకు మంగళవారం కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకుని నగదును ఆలయ ఏఈవో గట్టు శ్రవణ్కుమర్కు అందజేశారు.