సూర్యాపేట : జిల్లాలోని హుజూర్ నగర్ ( Huzurnagar ) లో శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఇందిరా చౌక్ వద్ద తెల్లవారుజామున మిర్యాలగూడ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ(Container ) ఒక్కసారిగా హోటల్లోకి దూసుకు వెళ్లింది. రోడ్డు ఇరుకుగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రమాద సమయంలో హోటల్లో జనాలు ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంటైనర్ను అక్కడి నుంచి తొలగించారు.