Health tips : శరీరం డీ హైడ్రేషన్ కాకుండా తరచూ మంచి నీళ్లు తాగడం చాలా అవసరం. దాంతో కిడ్నీలు సహా శరీరంలోని సున్నితమైన అవయవాలన్నీ తాజాగా ఉంటాయి. కానీ ఆరోగ్యానికి మంచిది కదా అని అదేపనిగా మంచి నీళ్లు తాగితే అసలుకే మోసం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డీ హైడ్రేషన్ (Dehydration) మాత్రమే కాదు, ఓవర్ హైడ్రేషన్ (Over-Hydration) కూడా ఆరోగ్యానికి హానికరమేనని వారు చెబుతున్నారు. మరి ఓవర్ హైడ్రేషన్ వల్ల కలిగే ఆ దుష్ప్రభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..