మనోహరాబాద్, డిసెంబర్ 8: రైతును రా జును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. వ్యవసాయంలో అన్ని వసతులను రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ఏర్పాటు చేశారు. గోదావరి జలాలు తూప్రా న్ మండలంలోని హల్దీవాగు నుం చి రైతులకు సాగు నీరు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. 365 రోజులు గోదావరి జలాలు అందుబాటులో ఉండటంతో స్థానిక రైతులు వ్యవసాయ ఉత్పత్తులను పెంచారు. దీంతో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయ డం ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయా ప్రాంతాల్లో గోదాముల నిర్మాణాలను చేపట్టారు.
పదెకరాల్లో రూ. 17 కోట్లతో నాలుగు గోదాముల నిర్మాణం
రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు వీలుగా రైతులకు వసతులు కల్పించాలని రాష్ట్ర మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ సీఎం కేసీఆర్‌ను లేఖద్వారా కోరారు. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్ వేర్ హౌజ్ కార్పొరేషన్ ద్వారా గోదాముల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీంతో తూప్రాన్ మున్సిపాలిటీ అల్లాపూర్ శివారులో 44 వ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా పక్కన పదెకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. మొదటి విడుతగా రూ.17 కోట్ల ను మంజూరు చేశారు. ఈ నిధులతో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నాలు గు గోదాముల నిర్మాణాన్ని ప్రారంభించారు. అతి త్వరలోనే గోదాములు రైతులకు అందుబాటులోకి రానున్నాయి.