హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి 31లక్షల చెక్కును డీజీపీ శివధర్‌రెడ్డి అందజేశారు. అంబర్‌పేట సీపీఎల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన బోయ పాండు, ఆయన భార్య గతేడాది మార్చి 25న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.