హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాలయంలోనే గురువారం ఓ హెడ్ కానిస్టేబుల్ త న సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌శాఖను కలవరపెట్టింది. డీజీపీ కార్యాలయంలోని షోగార్డ్లో హెడ్ కానిస్టేబుల్‌గా వేరుకొండలయ్య స్వామి(41) విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం ఉదయం 6.30 గంటలకు విధులకు వచ్చిన స్వామి, వాష్‌రూమ్‌కు వెళ్లి అక్కడే తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెం టనే విచారణ చేపట్టిన పోలీసులకు సూసై డ్ లెటర్ లభించింది. విషయం తెలిసిన వెంటనే డీజీపీ సీవీ ఆనంద్ కార్యాలయానికి చేరుకొని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకొని, దర్యాప్తు వేగవంతం చేయాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించారు. హెడ్‌కానిస్టేబుల్ స్వామికి ఆన్లైన్ బెట్టింగ్‌పై ఆసక్తి ఉన్నట్టు తోటి సిబ్బంది చెబుతున్నారు. లోన్‌యాప్స్‌ను ఆశ్రయిం చి ఈఎంఐలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు.
కాగా, ప్రస్తుతం లంగర్‌హౌస్‌లో ఉంటున్న స్వామి గతంలోనూ మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్టు అతని భార్య మౌనిక పోలీసులకు తెలిపారు. బుధవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడని, గురువారం తిరిగి రావాల్సి ఉందని చెప్పారు. ఈ క్రమంలో స్వామి ఆత్మహత్య చేసుకున్నట్టు గురువారం ఉదయం కొండాపూర్ బెటాలియన్ కార్యాలయం నుంచి సమాచారం అందించారని తెలిపారు. హుటాహుటిన తాను డీజీపీ కార్యాలయానికి చేరుకోగా.. కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో తన భర్త విగతజీవిగా పడి ఉన్నాడని ఆమె చెప్పారు. తన భర్త ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
స్వామి రాసిన సూసైడ్‌నోట్‌లో .. ‘ప్రియమైన శ్రీమతికి.. నీకు లేఖ రా స్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ను వ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్‌వి. అంద రూ నన్ను వద్దనుకున్నా నువ్వు మా త్రం కావాలనుకున్నావు.. అదొక్కటి చాలు ఈ జీవితానికి. నీతో ఇంకా జీవించాలని ఉంది. కానీ, ఈ దేవుడు నన్ను ఉండనీయడం లేదు. ఈ నిర్ణ యం నాది మాత్రమే. నువ్వే లేకపోయింటే.. ఇన్ని రోజులు ఉండేవాడిని కాదు. ఇప్పుడు జీవిస్తున్న బతుకు నీదే. నీ కోసమే ఇన్నిరోజులు ఉన్నా ను. ఐ లవ్యూ మౌనిక. ఐ మిస్‌యూ రా.. హని అండ్ మణి‘మామ్జీ’కి సపోర్ట్‌గా ఉండండి. నా ఆత్మకు శాంతి కలుగాలంటే నా భార్యాపిల్లలను ఎవ రూ ఏమీ అనొద్దు. ఇదే నా చివరి కోరి క. ఏదైనా తప్పు చేసి ఉంటే నేను మా త్రమే చేశాను. వాళ్లను ఏమీ అనొద్దు. ఇది నా చివరి కోరిక. ఎవరైనా నా భార్యా పిల్లలను బెదిరించినా, హింసించినా దయ్యం అయ్యి వాళ్లను వదిలిపెట్టను’ అని రాసుకొచ్చాడు.