సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కర్మాఖ్య’. అభినయకృష్ణ దర్శకత్వంలో శ్రీవాణీనాథ్, యశ్వంత్రాజ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్ను సీనియర్ నటి విజయశాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘తొలుత ఈ సినిమాకు ‘కామాఖ్య’ అనే టైటిల్ పెట్టాం. అయితే కొన్ని కారణాల వల్ల టైటిల్ మార్చాల్సి వచ్చింది.
అమ్మవారి అంశాలు కలిగిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఆద్యంతం అనూహ్య మలుపులతో ఉత్కంఠను పంచుతుంది’ అన్నారు. థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇదని నిర్మాత శ్రీవాణీనాథ్ తెలిపారు. ఆనంద్, శరణ్యప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, కథ, దర్శకత్వం: అభినయకృష్ణ.