సారంగాపూర్ ; జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కమ్మునూర్ శివారులోని గోదావరి నీరు లేక వెలవెలబోతున్నది. ఏటా జూలై చివరి వారంలో కమ్మునూర్ గోదావరి తీరం వరద ప్రవాహంతో కళకళలాడుతుండేది. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక.. పైనుంచి వరద రాక గోదావరి తీరం నీరు లేక బోసిపోయి కనిపిస్తున్నది.