హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను విధ్వంసం చేసే కుట్రను బ్యాంక్ ఉద్యోగులు సమర్థంగా ఎదుర్కోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని కామ్రేడ్ పొట్లూరి నాగేశ్వర్రావు సభా ప్రాంగణంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 30వ త్రైవార్షిక మహాసభల్లో భాగంగా రెండోరోజు ఆదివారం కూనంనేని సాంబశివరావు హాజరరై మాట్లాడారు.
28న యూపీఎస్‌కు వ్యతిరేకంగా నిరసన ;మార్చి వరకు దశలవారీగా ఆందోళనలు
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిపైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్)కు వ్యతిరేకంగా ఈ నెల 28న దేశవ్యాప్త నిరసనలకు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) పిలుపునిచ్చింది. యూపీఎస్ ప్రతులను దగ్ధం చేయాలని ఎన్‌ఎంవోపీఎస్ ప్రధాన కార్యదర్శి గంగాపురం స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 7న బెంగళూరు(కర్ణాటక)లో, మార్చి 2న హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఉద్యోగ ఉపాధ్యాయులంతా ఈ ఆందోళనలను విజయవంతం చేయాలని కోరారు. యూపీఎస్‌ను నిరసిస్తూ ఆదివారం కేరళలోని కోజికోడ్‌లో క్విట్ ఎన్పీఎస్- నో యూపీఎస్ మహా ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. స్థితప్రజ్ఞ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. బహిరంగ సభలో సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.