న్యూఢిల్లీ: ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో ఇవాళ లోక్సభలో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగంలోని మౌళిక విధానాన్ని ఆ బిల్లు దెబ్బతీస్తుందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ఆర్టికల్ 82లోని సబ్ ఆర్టికల్ 5.. ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు ఇస్తుందన్నారు. యుగాంతం వరకు ఒకే ఒక్క పార్టీ ప్రభుత్వాన్ని నడపదన్నారు. జమిలి బిల్లు.. ఎన్నికల సంస్కరణ బిల్లు కాదన్నారు. ఇది ఒక వ్యక్తి కాంక్ష, కలను నెరవేర్చే బిల్లు అని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు.
#WATCH | Congress MP Manish Tewari says “I rise to oppose the introduction of the Constitution 129th Amendment Bill 2024 and the Union Territories Laws Amendment Bill 2024. Beyond the seventh schedule of the Constitution is the basic structured doctrine and that basic structure… https://t.co/mW2OuEsceu pic.twitter.com/g5hs4oYlrm
— ANI (@ANI) December 17, 2024
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇవాళ వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ కింద ఆ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తోందని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి ఆరోపించారు. ఆ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఈ సభకు అర్హత లేదన్నారు. జమిలి ఎన్నికల బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని మనీశ్ తివారి డిమాండ్ చేశారు.
#WATCH | Samajwadi Party MP Dharmendra Yadav says “I am standing to oppose the 129th Amendment Act of the Constitution, I am not able to understand just 2 days ago, no stone was left unturned in the glorious tradition of saving the Constitution. Within 2 days, the Constitution… https://t.co/mW2OuEsceu pic.twitter.com/SqhAOZ4O7R
— ANI (@ANI) December 17, 2024
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ వ్యతిరేకించారు. దేశంలో నియంతృత్వ పాలన తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫారసు చేయాలని డీఎంకే నేత టీఆర్ బాలు ప్రభుత్వాన్ని కోరారు.