బీఆర్ఎస్ రైతు సదస్సుతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్
‘తిట్ల పురాణానికి ఆది పురుషుడు సీఎం రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పాలనలో డిస్ట్రక్షనే కానీ కన్స్ట్రక్షన్ లేదు.. ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు. తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రా జయ్య విమర్శించారు.
- రైతులు లేక రెవెన్యూ మంత్రి పొంగులేటి సభ అట్టర్ ఫ్లాప్
- మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య
హనుమకొండ, మే 7: ‘తిట్ల పురాణానికి ఆది పురుషుడు సీఎం రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పాలనలో డిస్ట్రక్షనే కానీ కన్స్ట్రక్షన్ లేదు.. ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు. తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రా జయ్య విమర్శించారు. గురువారం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్‌లో నిర్వహించిన రైతు మేళా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని అన్నారు.
సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ అక్రమాలకు పాల్పడుతూ రాహుల్‌గాంధీకి ఏటీఎంగా మారాడని ఆరోపించారు. తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. పేదల ఇండ్లు కూల్చుడే తప్ప ప్రాజెక్టులు కట్టడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కతున్నదని మాజీ ఎమ్మెల్యేల అరూరి రమేశ్ ఆరోపించారు. ఇచ్చిన హామీల అమలెప్పుడు కేటీఆర్ అడిగితే కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

