నాగర్‌కర్నూల్, జనవరి 22 : అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలపునిచ్చారు. గురువారం నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని 12, 13వ వార్డులో మర్రి పర్యటించగా.. స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ బాగోగులను అడిగి తెలుసుకొన్నారు. రేవంత్ సర్కార్ ఇస్తామన్న పథకాలు అమలు చేయడం లేదని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రెం డేండ్ల పాలనలో తాగునీటి సమస్య ఏర్పడిందని వాపోయారు. అనంతరం మర్రి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలో సౌకర్యాలు ఎలా ఉండేవి? ఇప్పుడెలా ఉన్నాయని మహిళలను అడిగారు. సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే నిలదీయాలని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.