మనోహరాబాద్, డిసెంబర్ 9 : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరుతున్నారని వైద్యా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో తూప్రాన్ మండలం నాగులపల్లి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ నర్సమ్మ, నాయకుడు రాజులు గురువారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, డైరెక్టర్ సంతోశ్‌రెడ్డి, జడ్పీటీసీ రాణిసత్యనారాయణగౌడ్, ఎంపీపీ స్వప్నావెంకటేశ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, నాయకుడు సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
హద్నూర్ కాంగ్రెస్ ఎంపీటీసీ టీఆర్ఎస్లో చేరిక
న్యాల్కల్, డిసెంబర్ 9 : మండలంలోని హద్నూర్ గ్రామ కాంగ్రెస్ ఎంపీటీసీ సలీం టీఆర్ఎస్లో చేరారు. గురువారం జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంపీటీసీ సలీంతో పాటు పలువురు కార్యకర్తలను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరినట్లు వారు చెప్పారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి హారీశ్‌రావును ఎంపీటీసీ సలీం పార్టీ నాయకులతో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సలీమ్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జహీరాబాద్ మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మండల ఎంపీపీ వైస్ చైర్మన్ గౌసొద్దీన్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, పీఎసీఎస్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఉప సర్పంచ్ షబ్బీర్‌ఖాన్, టీఆర్ఎస్ నాయకులు తిరుమల భాస్కర్, నర్సింహారెడ్డి, బక్కారెడ్డి, ము నీరోద్దీన్, సంగారెడ్డి, పడకంటి, వెంకట్, యాదల్పటేల్, ఎంపీటీసీలు దేశేట్టిపాటిల్, సిద్ధన్న, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.