మహబూబ్‌నగర్ : రెండేళ్ల కాంగ్రెస్ పాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును నిరసిస్తూ నాగర్‌కర్నూల్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు( Congress Leaders ) పార్టీని వీడారు. మంగళవారం మండలంలోని అవురాసిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ కార్యకర్తలు సింగరాజు రాజేష్ ,శ్రీమంతుల శ్రీకాంత్, అంజిరెడ్డి, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్ ( BRS) పార్టీలో చేరారు
. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి , జైపాల్ యాదవ్ , బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్( KCR ) సాధించిన తెలంగాణ పార్టీలో చేరడం తమకు సంతోషంగా ఉందని బీఆర్ఎస్లో చేరిన నాయకులు అన్నారు.