కొండాపూర్ : ఇచ్చిన హామీలు నెరవేర్చక, మాయమాటలతో మభ్య పెడుతున్న కాంగ్రెస్ పార్టీలో పనిచేయలేమంటూ ఒక్కొక్కరిగా కాంగ్రెస్ నాయకులు( Congress Leaders) గులాబీ బాట పడుతున్నారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారం , సునీల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR) సమక్షంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ చేసే మోసాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసేలా చేయాలని, ఎన్నికలెప్పుడు వచ్చిన గులాబీ పార్టీదే విజయం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి, గంగారం సంగారెడ్డి, చందర్ రావు, గౌస్, అనంతరెడ్డి, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.