హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్(congress) ప్రభుత్వం వచ్చాక అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. అధికారం అండతో కాంగ్రెస్ శ్రేణులు దాడులు, హత్యలకు తెగబడుతుండడంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతున్నది. తాజాగా పంచాయతీ ఎన్నికలో తమకు వ్యతిరేకంగా పనిచేశారనే అక్కసుతో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబంపై కాంగ్రెస్ గుండాలు దారుణానికి తెగబడ్డారు. విచక్షణారహితంగా దాడులకు తెగపడ్డారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత జిల్లాలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఖ్మమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ గెలిచిన నేపథ్యంలో ఓటమిని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తమ తీరును మార్చుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెప్తమని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.