మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య (జడ్పీ చైర్ పర్సన్) తిరిగి గులాబీ కండువా కప్పుకోవడాన్ని టీపీసీసీ అసలు జీర్ణించుకోలేకపోతున్నది. ఇంకెవరినైనా అర్జెంట్‌గా పార్టీలో చేర్చుకొని ప్రతీకారం తీర్చుకుందామని ప్రయత్నిస్తున్నా వర్కవుట్ కావడం లేదని సీనియర్ నేత ఒకరు వాపోయారు.
గతంలో పార్టీలో చేరుతామని ఆసక్తి కనబరిచినవారు కూడా ముఖం చాటేస్తున్నారని, కొందరేమో మంచి ముహూర్తం చూసుకొని మళ్లీ వస్తామని చెప్పి తిరిగి రాలేదన్నారు. తిరిగి వస్తామని మాట ఇచ్చిన వారిని కాంటాక్ట్ చేస్తే తిథిదేముంది కానీ.. పార్టీ పరిస్థితి అంత బాగలేదని ఇంట్లో వాళ్లు వద్దంటున్నారని చెప్పారట. అంటే కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మారేది, లేనిది నిర్ణయించుకుంటామని నేతలు చెప్పేది ఒట్టి హంబక్కేనన్న మాట! – వెల్జాల