హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం యాదగిరి ప్రతిష్ట ( Yadagirigutta temple) ను దిగజారుస్తుందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ( Gongidi Sunitha ) ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ( KCR ) ముఖ్యమంత్రిగా యాదగిరి గుట్ట అభివృద్ధికి రూ. 1300 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దారని వివరించారు.
దేవాలయం ఈవో గుట్ట అభివృద్ధి కోసం దాతలు కావలెను అని కరపత్రం( Pamplet ) విడుదల చేయడం విచారకరమని అన్నారు. దేవాలయ నిర్మాణం లో కేసీఆర్ ఎపుడూ దాతల సాయం కోరలేదు. ఆలయం పూర్తయిన తర్వాత బంగారం తాపడం కోసం మాత్రమే కేసీఆర్ దాతల సాయం కోరారని వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా కరపత్రం తెచ్చిన ఈవో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రూ.43 కొట్లతో వేద పాఠశాల కోసం కేసీఆర్ 2023 లో శంఖుస్థాపన చేయగా అవే పనులకు రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేసి దాతల సహాయం కోరడం అవమానకరం కాదా అని ప్రశ్నించారు. స్వామి వారి నిత్యకల్యాణ మండపాన్ని నిరించేందుకు పాలక మండలి చైర్మన్ తన సొంత నిధులు 9 కోట్లు ఇస్తానని ప్రకటించారు . మళ్లీ ఆ తొమ్మిది కోట్ల కోసం దాతల సాయాన్ని ఎలా కోరతారని అనుమానం వ్యక్తం చేశారు. భక్తులను అవమాన పరిచిన ఈవో భవాని శంకర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.
అందాల పోటీలకు కూడా యాదగిరి గుట్ట దేవాలయ నిధులను సిగ్గులేకుండా వాడుకున్నారని ఆరోపించారు. కొండాసురేఖ బర్తరఫ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నందున ఈ ఆరోపణలపై సీఎం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యాదగిరి దేవాలయ ప్రతిష్ట ను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళతాం . మానవ హక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయిస్తామని ఆమె స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో యాదగిరి గుట్ట బీఆర్ఎస్ నేతలు వెంకటయ్య ,మహేందర్ ,అనురాధ ,రామిరెడ్డి ,నరహరి పాల్గొన్నారు .